![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -179 లో.. కావ్యపై అపర్ణ ఇంకా కోపం తెచ్చుకోవాలని రుద్రాణి రెచ్చగొట్టేల మాట్లాడుతుంది. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ తెలియని అపర్ణ.. రుద్రాణి మాటలు నమ్మేస్తుంది. కావ్యని ఇలాగే వదిలేస్తే నీ స్థాయిలో కూర్చొని నిన్ను పక్కకి నెట్టివేస్తుందని కావ్యపై లేనిపోనివి చెప్పి రుద్రాణి సైలెంట్ గా అక్కడ నుండి తప్పుకుంటుంది.
ఆ తర్వాత కావ్య కోసం అపర్ణ ఎదురుచూస్తుంటుంది. కావ్య రాగానే అపర్ణ ఆగమని చెప్తుంది. మళ్ళీ నేనేం తప్పు చేసానని కావ్య అడుగుతుంది. నా కొడుకుతో మట్టి పిసికించావని అపర్ణ అనగానే.. మీకు ఇదంతా ఎప్పటికప్పుడు బాగానే తెలుస్తుందని రుద్రాణి, రాహుల్ వైపు చూస్తుంది. నా కొడుకు అలా చెయ్యడం, మీడియాలో రావడం, మా కుటుంబం పరువు ఏమైపోతుందని అపర్ణ అంటుంది. రాజ్ ఈ ఇంటికి యువరాజ్.. అలాంటి వాడితో ఇలాంటి పని చేయిస్తావా? అంటూ దొరికింది ఛాన్స్ అన్నట్టుగా కావ్యని నిలదిస్తుంది రుద్రాణి. మీరే ఇదంతా చేస్తున్నారు.. కావాలనే మా అత్తగారి ముందు నన్ను దోషిని చేస్తున్నారని కావ్య అంటుంది. ఒకరు చెప్తే వినే స్టేజ్ లో నేను లేనని అపర్ణ అనగానే.. అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి? నన్ను కోడలిగా ఒప్పుకోరు.. మీ అబ్బాయి నాతో ఉంటే చూడలేరు.. నాకు సపోర్ట్ చేస్తే ఒప్పుకోరు.. మీరు మమ్మల్ని విడదీయాలని అనుకుంటున్నారు. అసలు మీరు అతనికి కన్నతల్లేనా అని కావ్య అనగానే.. అప్పుడే వచ్చిన రాజ్.. ఆ మాట విని కోపంగా కావ్యపై చెయ్యి ఎత్తుతాడు. మరొకవైపు వర్షం పడేలా ఉందని చేసిన బొమ్మలు కనకం లోపలికి తీసుకొని వస్తుంటే.. ఒకటి కింద పడి పగిలిపోద్ది. అది చూసి కనకం టెన్షన్ పడుతూ.. ఏదో చెడు జరుగుతుందేమోనని భయంగా ఉందని కృష్ణమూర్తి తో కనకం చెప్తుంది. మరొకవైపు ఏం అన్నావ్ ? నా కన్నతల్లి గురించి అలా మాట్లాడతావా అని కావ్యపై రాజ్ కోప్పడతాడు. నేనేం తప్పుగా మాట్లాడలేదు.. మీ అమ్మకి నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదని కావ్య అనగానే.. మా అమ్మకే కాదు.. నాక్కూడా ఇష్టం లేదని రాజ్ అనగానే.. అది విని ఇంట్లో వాళ్ళంత షాక్ అవుతారు.
నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదని కావ్యని ఇంటి లోపలి నుండి ఈడ్చుకొని వెళ్ళి బయటకు నెట్టివేస్తాడు రాజ్. నేను ఎక్కడికి వెళ్ళను. ఇక్కడే ఉంటానని కావ్య చెప్తుంది. ఇందిరాదేవి అడ్డుచెప్పినా రాజ్ తన మాట వినడు. ఇంట్లో ఎవరి నిర్ణయం వాళ్లు తీసుకుంటున్నారని సీతరామయ్య అంటాడు. మరొకవైపు కావ్య వర్షంలో తడుస్తూ ఇంటిముందే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |